ఎస్‌ఐ పోస్టులకు అన్నాచెల్లెళ్ల ఎంపిక
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:42 AM
ఒకే కుటుంబంలో ఇద్దరు ఒకేసారి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు.
ఎర్రావారిపాలెం ,డిసెంబరు 22 ; ఒకే కుటుంబంలో ఇద్దరు ఒకేసారి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఎర్రావారిపాలెం మండలం పచ్చార్లవాండ్లపల్లె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పోకల చెన్నకేశవులు, గీతా సుధ దంపతులు.వీరిలో చెన్నకేశవులు ఏడాది క్రితం మరణించారు. పోకల గీతా సుధ ప్రస్తుతం భాకరాపేట జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయరాయులిగా పనిచేస్తోంది. వీరి కుమారుడు తేజ , కుమార్తె హారిక ఒకేసారి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఇంతకుముందే ‘కాగ్ ’ బెంగళూరు శాఖలో ఆడిటింగ్ అధికారి, సెంట్రల్ జీఎస్టీ డిపార్టుమెంటులో విశాఖ రీజియన్‌లో ఇన్స్‌పెక్టర్ పోస్టులకు ఎంపికైన తేజ ప్రస్తుతం చిత్తూరు జిల్లా గంగాధర నెలూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కార్యదర్శి పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేశాడు.ప్రస్తుతం మూడు పోస్టుల్లో ఏదో ఒకటి ఎంచుకునే పనిలో వున్నాడు.శుక్రవారం వారిద్దరినీ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఇంటివద్ద కలిసి అభినందించారు.