కాణిపాకంలో వైభవంగా సత్యనారాయణ వ్రతం
ABN , First Publish Date - 2023-02-06T01:37:16+05:30 IST
కాణిపాక ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి ఆలయంలో ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 5 : కాణిపాక ఆలయానికి అనుబంధమైన వరదరాజస్వామి ఆలయంలో ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని వరదరాజస్వామికి అభిషేకం నిర్వహించారు. స్వామిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి పటం ఉంచి భక్తుల ఆధ్వర్యంలో వ్రతాన్ని నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగించారు. ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, బాబు పాల్గొన్నారు.