సంగీత ఝరి... ఘంటసాల భక్తి విభావరి

ABN , First Publish Date - 2023-02-25T00:15:34+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఘంటసాల భక్తి విభావరిలో కాకినాడకు చెందిన పి.వి.రమణ సంగీత ఝరి ఆహూతులను ఓలలాడించింది.

సంగీత ఝరి... ఘంటసాల భక్తి విభావరి
తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్‌ కళాకారులు శివలీలలపై చేసిన నృత్యప్రదర్శన

తొట్టంబేడు, ఫిబ్రవరి 24 : శ్రీకాళహస్తీశ్వరస్వామివారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధూర్జటి కళాప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఘంటసాల భక్తి విభావరిలో కాకినాడకు చెందిన పి.వి.రమణ సంగీత ఝరి ఆహూతులను ఓలలాడించింది. ఘంటసాల గాత్రం నుంచి జాలువారిన పలు శివభక్తి గీతాలను రమణ ఆలపించిన తీరు భక్తిసాగరంలో ముంచెత్తింది. అంతకుముందు తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్‌ కళాకారులు శివలీలలపై చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయాధికారులు వీరిని ఘనంగా సత్కరించారు.

Updated Date - 2023-02-25T00:15:37+05:30 IST