ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ

ABN , First Publish Date - 2023-01-18T00:18:39+05:30 IST

- ఇద్దరు యువకుల దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ

భాకరాపేట, జనవరి 17: పీలేరు-తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. భాకరాపేట ఎస్‌ఐ ప్రకాశ్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన సాయికృష్ణ(22), హేమంత్‌(20) స్నేహితులు. ఇద్దరూ ఐటీఐ చదువుతున్నారు. సాయికృష్ణకు వరుసకు మామ అయ్యే శివ హైదరాబాదులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు స్వగ్రామమైన కేవీపల్లె మండలం నూతనకాల్వకు వచ్చాడు. అతడిని చూడటానికి తన స్నేహితుడైన హేమంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సాయికృష్ణ నూతనకాల్వకు వచ్చాడు. కనుమ వేడుక పూర్తయ్యాక మంగళవారం వీరిద్దరూ తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. శివ కూడా తిరుమలకు వెళ్లాలని అదే ద్విచక్ర వాహనంలో వారితో కలిసి బయల్దేరాడు. మార్గమధ్యంలోని భాకరాపేట ఘాట్‌లోకి వచ్చేసరికి ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాయికృష్ణ, హేమంత్‌ సంఘటనా స్థలంలో మృతి చెందగా.. శివకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో తిరుపతి రుయాస్పత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-18T00:35:34+05:30 IST