పంచాయతీలకు రూ.1.62 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2023-09-22T00:39:18+05:30 IST
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పంచాయతీలకు కొసరు నిధులు వచ్చాయి.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 21: ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న పంచాయతీలకు కొసరు నిధులు వచ్చాయి. జిల్లాలోని 684 గ్రామ పంచాయతీలకు రూ.1.62 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సర్పంచులకు పారితోషికం కింద రూ.62.73 లక్షలు, సీనరేజ్ చార్జీలకు రూ.58,55,565, తలసరి గ్రాంటు రూ.14,90,783, ప్రొఫెషనల్ ట్యాక్స్ రూ.25,95,140 వంతున ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాలను పంచాయతీల జనరల్ ఫండ్‌కు జమచేస్తారు.