రుయాస్పత్రి సూపరింటెండెంట్‌గా రవి ప్రభు
ABN , First Publish Date - 2023-05-26T02:11:43+05:30 IST
రుయాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రవి ప్రభును నియమిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది.

తిరుపతి సిటీ, మే 25 : రుయాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ రవి ప్రభును నియమిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాగ మునీంద్రుడు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనుండటంతో ఈయన స్థానంలో రవి ప్రభును నియమించారు. ఈయన ప్రస్తుతం ఎస్వీ వైద్య కళాశాలలో సామాజిక వైద్య విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు వైద్య విభాగాధిపతులు ఆయనకు అభినందనలు తెలిపారు.