ఘనంగా రంజాన్ వేడుకలు
ABN , First Publish Date - 2023-04-23T01:49:35+05:30 IST
నెల రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. నింగిలో నెలవంక కనబడటంతో శనివారం ముస్లింలు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.
దీక్ష విరమణ.. భక్తి శ్రద్ధలతో ప్రార్థన
నెల రోజుల ఉపవాస దీక్షలు ముగిశాయి. నింగిలో నెలవంక కనబడటంతో శనివారం ముస్లింలు రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. అందరూ ఈద్గాల వద్దకు చేరుకుని ప్రార్థనలు చేశారు. పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. చిత్తూరు గిరింపేటలోని ఈద్గా మైదానంలో ప్రభుత్వ ఖాజీ కమాలుల్లా జుహూరీ జునైదీ తన బోధనలు వినిపించారు.
- చిత్తూరు కల్చరల్