జూన్‌లో వానలు సాధారణం
ABN , First Publish Date - 2023-06-26T23:58:26+05:30 IST
నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా, ఇతర జిల్లాలతో పోలిస్తే ఒక్క చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 80.9 మిమీ కాగా.. సోమవారానికే 85.3 మిమీ వర్షపాతం నమోదైంది.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 26: నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినా, ఇతర జిల్లాలతో పోలిస్తే ఒక్క చిత్తూరు జిల్లాలోనే సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్‌లో సాధారణ వర్షపాతం 80.9 మిమీ కాగా.. సోమవారానికే 85.3 మిమీ వర్షపాతం నమోదైంది. మున్ముందు విస్తరిస్తున్న రుతుపవనాలతో మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కాగా చౌడేపల్లెతో పాటు 8 మండలాల్లో తీవ్ర వర్షాభావం నెలకొంది. చౌడేపల్లెలో సగటు 71.8 సాధారణ వర్షం కురవాల్సివుండగా, 60శాతం కంటే తక్కువగా 22.6 మిమీ మాత్రమే కురిసింది. దీంతో పాటు మరో ఏడు మండలాల్లో 50 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా వెదురుకుప్పంలో 101 మిమీకి బదులు 42.2 మిమీ.. రొంపిచెర్లలో 75కి 33.. సోమలలో 66.1కి 47.4.. పెద్దపంజాణిలో 90.1కి 57.4.. బైరెడ్డిపల్లెలో 98.2కి 57.6.. వి.కోటలో 86.3కి 73 మిమీ.. రామకుప్పంలో 79 మిమీకి గాను 60.4 మిమీ వర్షపాత నమోదైంది.