24 మండలాల్లో వర్షం
ABN , First Publish Date - 2023-11-06T00:54:26+05:30 IST
జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 మండలాల్లో వర్షం కురిసింది.
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 5: జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా పలమనేరు మండలంలో 50.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా తంబళ్లపల్లిలో 0.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలోని వివిధ మండలాల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. రామకుప్పంలో 36.8 మి.మీ, గంగవరంలో 34.6 మి.మీ, పెనుమూరులో 22.6 మి.మీ, బైరెడ్డిపల్లిలో 21.4 మి.మీ, శాంతిపురంలో 21.2 మి.మీ, వి.కోటలో 19.2 మి.మీ, గుడుపల్లిలో 18.4 మి.మీ, కుప్పంలో 17.4 మి.మీ, ఎస్‌ఆర్‌పురంలో 16.6 మి.మీ, పుంగనూరులో 10.2 మి.మీ, యాదమరిలో 9.4 మి.మీ, రొంపిచెర్లలో 8.6 మి.మీ, సదుం, బంగారుపాళ్యంలో 7.2 మి.మీ, నిండ్ర, నగరిలో 6.2 మి.మీ, చిత్తూరులో 4.8 మి.మీ, చౌడేపల్లిలో 4.6 మి.మీ, పెద్దపంజాణిలో 4.2 మి.మీ, సోమలలో 3.6 మి.మీ, కార్వేటినగరంలో 1.4 మి.మీ, పూతలపట్టులో 1.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.