జాతీయస్థాయి టగ్ ఆఫ్ వార్‌కు పూతలపట్టు బాలికల ఎంపిక
ABN , First Publish Date - 2023-07-21T00:37:15+05:30 IST
32వ జాతీయస్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలకు పూతలపట్టు ఉన్నత పాఠశాల బాలికలు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పూతలపట్టు, జూలై 20: 32వ జాతీయస్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీలకు పూతలపట్టు ఉన్నత పాఠశాల బాలికలు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డు సమీపాన గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో జాతీయస్థాయి సబ్ జూనియర్, జూనియర్ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.