Share News

గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:23 PM

తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె మంగళవారంతో పదిహేనవ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో సిబ్బంది జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించడంతో పాటు గిన్నెలపై శబ్దాలు చేస్తూ వేతనాలు పెంచి తమ ఆకలి బాధలు తీర్చాలంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన
తిరుపతిలో అంగన్వాడీల నిరసన

తిరుపతి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన సమ్మె మంగళవారంతో పదిహేనవ రోజుకు చేరుకుంది. ఈ నేపధ్యంలో సిబ్బంది జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించడంతో పాటు గిన్నెలపై శబ్దాలు చేస్తూ వేతనాలు పెంచి తమ ఆకలి బాధలు తీర్చాలంటూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరులో గ్రామసేవకుల భవనం వద్ద తొలుత రిలే నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యోగులు అనంతరం టవర్‌ క్లాక్‌ సెంటర్‌ చేరుకుని గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఐఎ్‌ఫటీయూ, యూటీఎఫ్‌ నాయకులు, ఆశా వర్కర్లు మద్దతు పలికారు. ్లక్‌ సెంటర్‌ వద్ద గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. కోట, శ్రీకాళహస్తి, బీఎన్‌ కండ్రిగలలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కార్యాలయాల వద్ద రిలే దీక్షలు కొనసాగించడంతో పాటు గిన్నెలతో శబ్దాలు చేసి ప్రభుత్వ తీరును నిరసించారు. చంద్రగిరిలో రిలే దీక్షలు చేపట్టిన సిబ్బంది శిబిరంలో మోకాళ్ళపై నిలుచుని నిరసన తెలియజేయగా ఏపీ మెడికల్‌ ఎంప్లాయాస్‌ యూనియన్‌ నేతలు మద్దతు ప్రకటించారు. పిచ్చాటూరులో రిలే దీక్ష కొనసాగించిన అంగన్‌వాడీ ఉద్యోగులకు టీడీపీ నేతలు మద్దతు తెలిపి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. తిరుపతిలో పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద, వెంకటగిరి, నాయుడుపేట, సత్యవేడు, పుత్తూరులలో సిబ్బంది రిలే దీక్షలు కొనసాగించగా సూళ్ళూరుపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టిన సిబ్బందికి యూటీఎఫ్‌ నాయకులు సంఘీభావం తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 11:23 PM