డెయిరీ భవనం ఎక్కి నిరసన

ABN , First Publish Date - 2023-09-20T01:19:22+05:30 IST

పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ కార్మికులు చిత్తూరు డెయిరీ ముందు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి ఏడో రోజుకు చేరాయి.

డెయిరీ భవనం ఎక్కి నిరసన
డెయిరీ ఎక్కి నిరసన తెలుపుతున్న కార్మికులు

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 19: పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని డిమాండు చేస్తూ కార్మికులు చిత్తూరు డెయిరీ ముందు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారానికి ఏడో రోజుకు చేరాయి. సోమవారం వినాయక చవితి సందర్భంగా డెయిరీ ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్మికులు భజన చేసిన నిరసన తెలిపారు. కాగా మంగళవారం డెయిరీ భవనం ఎక్కి నిరసన తెలిపారు. డెయిరీ ప్రభుత్వం నిర్వహిస్తుందని మాయమాటలు చెప్పి, చివరికి అమూల్‌కు అప్పగించారన్నారు. డెయిరీ తెరుస్తుంది తమకు న్యాయం జరుగుతుందని భావించినా, ఆ ప్రక్రియ నీరుగారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమూల్‌కు అప్పగించే క్రమంతో తమకు పెండింగ్‌ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం, చివరికి అమూల్‌కు అప్పగించే వేదికపై తమకు రావాల్సిన జీతాల బకాయిలు ఇస్తారని ఆశించినా, ఫలితం కనిపించలేదన్నారు. ఇకనైనా తమ బాధను అర్థం చేసుకుని తమకు ఇస్తామని చెప్పి క్యాబినేట్‌లో ఆమోదం తెలిపిన జీతాల బకాయి మొత్తాలను చెల్లించాలని కోరారు. ఈ నిరసనలో కరీం, పీడీ కుమార్‌, సుబ్రమణ్యం, ఎబినేజర్‌, బషీర్‌, రూబన్‌, మాధవరెడ్డి, రామూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T01:19:22+05:30 IST