వరసిద్ధుడి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2023-03-19T01:02:29+05:30 IST
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

ఐరాల (కాణిపాకం), మార్చి 18: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ రాయ్, రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు కాటమనేని భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, స్వామివారిని వేర్వేరు సమయాల్లో దర్శనం చేసుకున్నారు. వీరిని ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామిదర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందించారు. తహసీల్దార్ సుశీల, సీఐ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజి నాయుడు తదితరులు పాల్గొన్నారు.