ప్రసాదం వికటించింది
ABN , First Publish Date - 2023-09-20T01:47:50+05:30 IST
ప్రసాదం తిని 132 మంది అస్వస్థత పాలైన సంఘటన కేవీబీపురం మండలంలోని ఆరె గ్రామంలో చోటు చేసుకుంది.

ఆరె గ్రామంలో అస్వస్థత పాలైన 132మంది
కేవీబీపురం,సెప్టెంబరు 19 : ప్రసాదం తిని 132 మంది అస్వస్థత పాలైన సంఘటన కేవీబీపురం మండలంలోని ఆరె గ్రామంలో చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జయంతి వేడుకల్లో భాగంగా శనివారం చిత్ర పటాన్ని గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా గుడిలో తయారు చేసిన ప్రసాదం, పులిహోర, గుగ్గిళ్ళు, బెల్లం ప్రసాదాన్ని పంపిణీ చేశారు.వర్షం రావడంతో ఊరేగింపు నిలిపివేసి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించి శనివారం రాత్రి మిగిలిన ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆదివారం వరకు బాగానే వున్న ప్రసాదం తిన్న గ్రామస్తులు సోమవారం వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఇబ్బంది పడడం ప్రారంభించారు. సచివాలయంలోని ప్రభుత్వ క్లినిక్‌లో వారికి వైద్యం అందించారు.బాధితుల సంఖ్య మంగళవారానికి 132మందికి పెరగడంతో డీఎంహెచ్‌వో శ్రీహరి, డీఎంవో తేజస్విని, వైద్యుల బృందం ఆరె గ్రామంలోనే క్యాంపును నిర్వహించి రోగులకు చికిత్సలు అందించారు. ఉదయాన్నే తహసిల్దార్ శ్రీదేవి వైద్యశఙబిరాన్ని పరిశీలించి ఇద్దరిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.108 అంబులెన్సులను సిద్ధంగా వుంచారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో వుందని,అందరూ కోలుకుంటున్నారని డాక్టర్లు కుమార్, వాణి చెప్పారు.