Share News

వెంకటాచలపతికి డాక్టరేట్‌ ప్రదానం

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:42 AM

శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లెకు చెందిన ఎం.వెంకటాచలపతికి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

వెంకటాచలపతికి డాక్టరేట్‌ ప్రదానం
వెంకటాచలపతి

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29 : శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లెకు చెందిన ఎం.వెంకటాచలపతికి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. హిస్టరీ డిపార్టుమెంట్‌ ప్రొఫెసర్‌ టి.నాగమ్మ పర్యవేక్షణలో ‘ఇండస్ర్టీస్‌ ఇన్‌ ఆంరఽధ (క్రీ.శ.1300 - క్రీ.శ.1600)’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించగా పీహెచ్‌డీ ప్రదానం చేసినట్లు ఎస్వీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ దామ్లానాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈయన రాసిన ఐదు పరిశోధనా వ్యాసాలు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌చే గుర్తించబడిన అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. గతంలో ఈయన అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, చరిత్ర శాఖలో పరిశోధకుడిగా ఉండి ‘బాబూ జగజ్జీవన్‌ రామ్‌ - ఏ ప్రొఫైల్‌’ అనే టైటిల్‌పై సిద్ధాంత గ్రంథాన్ని ఆ యూనివర్శిటీకి సమర్పించి పరిశోధక పట్టా అందుకున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 02:42 AM