Share News

మా మంచి ప్రిన్సిపాల్‌ !

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:12 AM

ఐదేళ్లపాటు ఆ విద్యార్థినుల్లో ఒకరిగా కలసిపోయిన ప్రిన్సిపాల్‌ వారికి తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయత రుచిచూపించాడు.అలాంటి ప్రిన్సిపాల్‌ తమను వదిలి వెళ్లడాన్ని పిల్లలు భరించలేకపోయారు

మా మంచి ప్రిన్సిపాల్‌ !
భావోద్వేగంతో ప్రిన్సిపాల్‌ను చుట్టుముట్టిన పిల్లలు

కోట, డిసెంబరు 17 : ఐదేళ్లపాటు ఆ విద్యార్థినుల్లో ఒకరిగా కలసిపోయిన ప్రిన్సిపాల్‌ వారికి తల్లిదండ్రుల ప్రేమ, అప్యాయత రుచిచూపించాడు.అలాంటి ప్రిన్సిపాల్‌ తమను వదిలి వెళ్లడాన్ని పిల్లలు భరించలేకపోయారు. కోట మండల పరిధిలోని విద్యానగర్‌ గురుకులంలోని 300 మంది విద్యార్థినులు భోరుమని విలపించడం చూసినవారి తల్లిదండ్రుల కళ్లు కూడా చెమ్మగిల్లాయి.విద్యానగర్‌లో బీసీ బాలికల గురుకులాన్ని ఐదేళ్లుగా నడుపుతున్నారు. విద్యార్థినుల పర్యవేక్షణ కోసం తిరుపతికి చెందిన అదే గురుకులంలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైరైన లంకిపల్లి రామ్మూర్తిని నియమించారు.మూడేళ్లుగా ఆయన ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తూ పిల్లల మన్ననలు పొందారు. అయితే బీసీ గురుకులాలలోని పలువురు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి అంజనమ్మ అనే ఉపాధ్యాయురాలిని ఈ గురుకులానికి ఇటీవల ప్రిన్సిపాల్‌గా నియమించారు. దీంతో అంజనమ్మకు బాధ్యతలు అప్పగించి రామమూర్తి బయల్దేరు తుండగా ఒక్కసారిగా గురుకులంలోని విద్యార్థినులంతా భోరున విలపిస్తూ వెళ్లవద్దంటూ ఆయన కాళ్లపై పడ్డారు. సిబ్బంది కూడా కంటతడిపెట్టి వెళ్లవద్దని ప్రాధేయపడ్డారు.

Updated Date - Dec 18 , 2023 | 12:12 AM