Share News

అడుసు దున్నుతూ ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2023-12-11T00:41:50+05:30 IST

మండలంలోని కొట్టాలు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమిళనాడు సరిహద్దులో అడుసుని ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఆ ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఆవ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.

అడుసు దున్నుతూ ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరి మృతి
ట్రాక్టరు బోల్తాపడటంతో ఇరుక్కొని చనిపోయిన గోపి

గంగాధరనెల్లూరు, డిసెంబరు 10: మండలంలోని కొట్టాలు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమిళనాడు సరిహద్దులో అడుసుని ట్రాక్టర్‌తో దున్నుతుండగా ఆ ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో ఆవ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గంగాధరనెల్లూరు మండలం కొత్తవెంకటాపురం పంచాయతీ కొట్టాలు(అగ్రహారంకు సమీపంలోని) గ్రామానికి చెందిన సుబ్రమణ్యం నాయుడు కుమారుడు గోపి నాయుడు (42) రెండు కిలోమీటర్ల దూరంలోగల తమిళనాడు సరిహద్దు వడ్నేరి గ్రామానికి సమీపంలో ఓ రైతు వరి మడి దున్నేందుకు ఆదివారం ట్రాక్టర్‌ తీసుకుని బాడుగకు వెళ్లాడు. గోపి నాయుడు అడుసు దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతి చెందిన గోపి నాయుడుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గోపి నాయుడి మృతితో కొట్టాలు, అగ్రహారం గ్రామాల్లోని అతడి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాదం గురించి పోలీ్‌సస్టేషన్‌లో సమాచారం అందించారే కానీ మృతుడి కుటుంబసభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌.ఐ రామాంజనేయులు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T00:41:51+05:30 IST