రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2023-09-18T01:42:51+05:30 IST

నగరి మండలం వీకేఆర్‌పురం పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసన్‌(50) మృతి చెందగా, కృష్ణప్పన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నగరి, సెప్టెంబర్‌ 17: నగరి మండలం వీకేఆర్‌పురం పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసన్‌(50) మృతి చెందగా, కృష్ణప్పన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ‘తమిళనాడు రాష్ట్రం ఆర్‌కే.పేటలోని బాలాపురానికి చెందిన శ్రీనివాసన్‌, కృష్ణప్పన్‌ బైకుపై శనివారం నగరిలో పెళ్లికి వచ్చారు. ఆదివారం వేకువజామున ఇంటికి వెళుతుండగా, వీకేఆర్‌పురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాసన్‌ మృతి చెందగా, కృష్ణప్పన్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని సీఐ సురేష్‌ తెలిపారు.

Updated Date - 2023-09-18T01:42:51+05:30 IST