వారంలో ఒక్కరోజు చేనేత దుస్తులు ధరించాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2023-08-08T01:06:23+05:30 IST
చేనేత రంగ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజైనా తప్పక చేనేత దుస్తులు ధరించాలని కలెక్టర్ షన్మోహన్ అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 7: చేనేత రంగ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒక్కరోజైనా తప్పక చేనేత దుస్తులు ధరించాలని కలెక్టర్ షన్మోహన్ అన్నారు. సోమవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఆప్కో ఏర్పాటుచేసిన స్టాల్‌ను జేసీ శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు ఆయన చేనేత రంగానికి సంబంధించిన ర్యాలీలో కార్మికులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నేతన్న నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అనంతరం డీఆర్డీఏ మీటింగ్ హాలులో జరిగిన సమావేశంలో పలువురు చేనేత కార్మికులను జేసీ శ్రీనివాసులు శాలువ కప్పి సన్మానించారు. ఈ-మార్కెటింగ్ కోసం వ్యాపార కూడళ్లల్లో చేనేతరంగ వస్త్ర ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు, చిత్తూరు జిల్లా చేనేత కార్మిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు పండరినాథ్, కార్యదర్శి షణ్ముఖవర్మ, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బాలాజీ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.