చంద్రబాబుపై అభ్యంతరకర ఫ్లెక్సీ

ABN , First Publish Date - 2023-06-26T01:46:45+05:30 IST

లోకేశ్‌ పాదయాత్ర నేపథ్యంలో నాయుడుపేట గడియారం సెంటర్‌లో చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసి ఉన్న అభ్యంతరకర ఫ్లెక్సీని తొలగించాలని టీడీపీ శ్రేణులు ఆదివారం పట్టుబట్టాయి

చంద్రబాబుపై అభ్యంతరకర ఫ్లెక్సీ
పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం

నాయుడుపేట, జూన్‌ 25: లోకేశ్‌ పాదయాత్ర నేపథ్యంలో నాయుడుపేట గడియారం సెంటర్‌లో చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసి ఉన్న అభ్యంతరకర ఫ్లెక్సీని తొలగించాలని టీడీపీ శ్రేణులు ఆదివారం పట్టుబట్టాయి. దీనికి పోలీసులు అడ్డుచెప్పడంతో వాగ్వాదం జరిగింది. నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా బెదరకుండా చట్టపరంగా ఏమైనా చేసుకోండంటూ ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ.. పోలీసులపై, వ్యవస్థలపై తమకు గౌరవం ఉందన్నారు. పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించాలని కోరామన్నారు. తమ పార్టీ అధినేత, పార్టీపై అభ్యంతరకరంగా పెట్టిన ఫ్లెక్సీలను తొలగించాలని విన్నవించామని, అయినా పోలీసులు పట్టించుకోక పోవడం సరికాదని అన్నారు.

Updated Date - 2023-06-26T01:46:45+05:30 IST