ఎంపీ గోరంట్లను అరెస్టు చేయాలి: కటారి
ABN , First Publish Date - 2023-10-28T01:03:12+05:30 IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మేయర్ కటారి హేమలత డిమాండు చేశారు.
చిత్తూరు సిటీ, అక్టోబరు 27: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ మేయర్ కటారి హేమలత డిమాండు చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. గోరంట్ల మాధవ్ బహిరంగంగ సభలోనే 2024లో జగన్ సీఎం అవుతారని, చంద్రబాబు నాయుడు చస్తారని చెప్పడాన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ చేయాలని కోరారు. అక్రమంగా అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు తనకు భద్రత లేదని స్వయంగా ఏసీబీ న్యాయమూర్తికి లేఖ రాశారని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే గోరంట్ల మాధవ్ ఇలాంటి వాఖ్యలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. వెంటనే ఎంపీని అరెస్టుచేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
నగరి: జగన్ మెప్పుకోసం ఎంపీ గోరంట్ల మాధవ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తెలుగు మహిళ అధికార ప్రతినిధి మీరా శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇలాంటి పనికిమాలిన నాయకుడిని వైసీపీలో కొనసాగిస్తున్నందుకు జగనన్న చావాలంటూ ధ్వజమెత్తారు. తమ నాయకుడు త్వరలోనే బయటకు వచ్చి మీ భరతం పడతారని హెచ్చరించారు.