Share News

ఉన్సిగానిపల్లె ఓటరు జాబితాలో బయటపడుతున్న పొరబాట్లు

ABN , First Publish Date - 2023-11-21T02:49:29+05:30 IST

రామకుప్పం మండలం ఉన్సిగానిపల్లె పంచాయతీ ఓటరు జాబితాలో వెదికేకొద్దీ పొరబాట్లు బయటపడుతున్నాయి.

ఉన్సిగానిపల్లె ఓటరు జాబితాలో బయటపడుతున్న పొరబాట్లు
గోనుగూరుకు చెందిన రత్నమ్మ, విశ్వనాథకు ఉన్న ఓట్లు

రామకుప్పం, నవంబరు 20: రామకుప్పం మండలం ఉన్సిగానిపల్లె పంచాయతీ ఓటరు జాబితాలో వెదికేకొద్దీ పొరబాట్లు బయటపడుతున్నాయి. 92వ బూత్‌లో 859 ఓట్లు ఉండగా, 21మంది చనిపోయిన, 19మంది శాశ్వతంగా గ్రామాలను వదిలిన వారు, 32మంది పెళ్ళి చేసుకుని అత్తారిళ్ళకు వెళ్ళిన మహిళల పేర్లు ఉన్నాయి. 8మందికి రెండేసి చొప్పున ఓట్లు ఉన్నాయి.

కుప్పం మండలం గోనుగూరుకు చెందిన కృష్ణమూర్తి, ఉషారాణి, రత్నమ్మ, విశ్వనాథకు ఉన్సిగానిపల్లె 92వ బూత్‌లో ఓట్లు ఉన్నట్టు ముసాయిదా జాబితాలో ఉన్నాయి.

ఓటరు జాబితాలో 8మందికి రెండేసి ఓట్లు ఉన్నాయి. దేవి అనే మహిళకు రెండు ఓట్లుండగా ఓ చోట 7-81 డోర్‌ నెంబరుండగా, మరో చోట 1-52 డోర్‌నెంబరుంది. ఈమెకు క్రమసంఖ్య 962, 617లో ఓట్లున్నాయి. ఓచోట ఆమె వయస్సు 29ఏళ్లు ఉండగా, ఇంకో దగ్గర 31 ఏళ్లుగా ఉంది. జ్ఞానశేఖర్‌కు క్రమసంఖ్య 284, 286లో రెండు ఓట్లు ఉన్నాయి. డోర్‌ నెంబర్లు ఓ చోట 1-95, ఇంకో దగ్గర 2/43డీ గా ఉన్నాయి. వయస్సు కూడా 26, 27గా ఉన్నాయి.

Updated Date - 2023-11-21T02:49:30+05:30 IST