Share News

మినీ స్టేడియమా.. లేక బురద స్టేడియమా: థామస్‌

ABN , First Publish Date - 2023-12-06T00:54:12+05:30 IST

మండల కేంద్రంలో ఎన్నికల సమయంలో మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్టేడియాన్ని ఎక్కడ నిర్మించారో చెప్పాలని జీడీనెల్లూరు టీడీపీ ఇన్చార్జి థామస్‌ ప్రశ్నించారు.

మినీ స్టేడియమా.. లేక బురద స్టేడియమా: థామస్‌
స్టేడియం నిర్మాణ స్థలాన్ని చూపుతున్న టీడీపీ ఇన్చార్జి థామస్‌

వెదురుకుప్పం, డిసెంబరు 5: మండల కేంద్రంలో ఎన్నికల సమయంలో మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్టేడియాన్ని ఎక్కడ నిర్మించారో చెప్పాలని జీడీనెల్లూరు టీడీపీ ఇన్చార్జి థామస్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వెదురుకుప్పంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన వెదురుకుప్పం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇక్కడే స్టేడియం నిర్మిస్తామని చెప్పిన నారాయణస్వామీ... ఇది మినీ స్టేడియమా లేక బురద స్టేడియమా అని ఎద్దేవా చేశారు. స్వామికి డిప్యూటీ సీఎం పదవి వస్తే చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించారు తప్ప అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదని థామస్‌ అన్నారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు మెహన్‌మురళి, గుండయ్య, చెంగల్రాయ యాదవ్‌, బీగాల రమేష్‌, తిరుమలనాథ్‌, దామోదరం పాల్గొన్నారు.

Updated Date - 2023-12-06T00:54:13+05:30 IST