రేపు చిత్తూరులో మెగా జాబ్‌మేళా

ABN , First Publish Date - 2023-08-22T01:21:17+05:30 IST

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 21: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ షన్మోహన్‌ పిలుపునిచ్చారు.

రేపు చిత్తూరులో మెగా జాబ్‌మేళా
జాబ్‌మేళా గోడపత్రికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 21: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు స్థానిక పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ షన్మోహన్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జాబ్‌మేళా గోడపత్రికను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌ మాట్లాడుతూ మెగా జాబ్‌మేళాలో అమర్‌రాజా, అమర్‌రాజా గ్రూప్‌, అపోలో ఫార్మసి, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం, మహేంద్ర హోం ఫైనాన్స్‌ లిమిటెడ్‌, టీసీఎల్‌తో పాటు పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఫెయిల్‌, పాస్‌ అయిన 18 - 35 మధ్య వయస్సు కల్గిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇతర వివరాలకు 7893110120 లేదా 6300954441, 9505601887 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ ఉపాధి అధికారిణి పద్మజ, పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవనజ్యోతి, డీఈవో విజయేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:21:17+05:30 IST