పుష్కరిణిలో మహా హారతులు

ABN , First Publish Date - 2023-03-05T01:06:04+05:30 IST

కాణిపాకంలో నిర్వహిస్తున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ పుష్కరిణిలో మహా హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

పుష్కరిణిలో మహా హారతులు
పుష్కరిణికి హారతి ఇస్తున్న స్మాత్మానందేంద్ర సరస్వతి

ఐరాల(కాణిపాకం), మార్చి 4: కాణిపాకంలో నిర్వహిస్తున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనం రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ పుష్కరిణిలో మహా హారతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చక, పండితులు నక్షత్ర హారతితో కోనేరుకు హారతులు పట్టారు. శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కోనేరుకు మహా హారతి ఇవ్వడం ద్దారా ప్రపంచశాంతి నెలకొంటుందన్నారు. లక్ష మోదక హవనం కార్యక్రమం ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండి పాడిపంటలు చక్కగా ఉంటాయన్నారు. మహా హారతి కార్యక్రమాన్ని వీక్షించడానికి వందలాదిగా భక్తులు విచ్చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు, ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T01:06:04+05:30 IST