కొంచెం కొంచెంగా..!

ABN , First Publish Date - 2023-06-26T01:35:27+05:30 IST

ఆక్రమణదారుల కన్ను చెరువుపై పడింది. కొంచెం కొంచెంగా.. బండరాళ్లను తోలి పూడ్చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ ఆక్రమణకు పాల్పడేవారు అధికార పార్టీ సానుభూతిపరులు కావడం.. నేతల అండ ఉండటమే కారణమన్న ఆరోపణలున్నాయి.

కొంచెం కొంచెంగా..!
బండరాళ్లను తోసి చెరువును పూడ్చుతున్న ఎక్స్‌కవేటర్‌

చిత్తూరు, జూన్‌ 25: ఆక్రమణదారుల కన్ను చెరువుపై పడింది. కొంచెం కొంచెంగా.. బండరాళ్లను తోలి పూడ్చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ ఆక్రమణకు పాల్పడేవారు అధికార పార్టీ సానుభూతిపరులు కావడం.. నేతల అండ ఉండటమే కారణమన్న ఆరోపణలున్నాయి. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని తేనబండ సమీపంలోని కొత్తూరు చెరువు ఆక్రమణకు గురవుతోంది. తేనబండ, మంగసముద్రం సర్వే నెంబరులోని 10-31. 10-32, 212 లెక్క దాఖలాలో 200 ఎకరాల్లో కొత్తూరు చెరువు ఉంది. ఈ చెరువు క్రమేణా ఆక్రమణకు గురై ప్రస్తుతం 150 ఎకరాల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కొత్తూరు చెరువులోని కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన కొంతమంది అధికార పార్టీ సానుభూమతి పరులు ఆక్రమించుకునే పనిలో పడ్డారు. అక్కడ ఎకరం భూమి విలువ తక్కువంటే కోటి వరకు పలుకుతోంది. అంత విలువైన భూమి కావడంతో ఆక్రమణదారులు పక్కనే ఉన్న గుట్టలోని పెద్దపెద్ద రాళ్లు తెచ్చి.. పల్లంలో వేసి వాటిపై పక్క చెరువులో ఉన్న మట్టిని తెచ్చి తోలి చదును చేసున్నారు. ఇప్పటికే ఎకరం భూమి వరకు ఆక్రమించారు. అప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తారా? లేదా చూసీచూడనట్లు ఉండిపోతారా అన్నది వేచిచూడాలి.

Updated Date - 2023-06-26T01:35:27+05:30 IST