ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:17 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలోని ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలోని ఐదు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాలవారీగా విజయపురంలో 3.2, పెద్దపంజాణిలో 1.2, గంగవరంలో 1.2, పాలసముద్రంలో 1.2, పులిచెర్లలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైంది.