పెళ్లికెళ్లొద్దాం..

ABN , First Publish Date - 2023-01-18T00:23:49+05:30 IST

ఖర్చు కార్పొరేషన్‌ ఖాతాలో వేసేద్దాం! - తిరుపతి కార్పొరేటర్ల మాస్టర్‌ ప్లాన్‌

పెళ్లికెళ్లొద్దాం..

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

తిరుపతి కార్పొరేటర్‌లు ఈ నెలాఖరులో డిల్లీ వెళ్లబోతున్నారు. ఢిల్లీ కార్పొరేషన్‌ అభివృద్థిని చూసి అధ్యయనం చేయడానికి స్టడీ టూర్‌కి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కార్పొరేషన్‌ నిధుల నుంచి రూ.25లక్షలు ఖర్చు చేయబోతునారని తెలిసింది. స్టాండింగ్‌ కౌన్సిల్లో దీనికి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. అయితే బుధవారం జరగనున్న జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం అజెండాలో ఈ అంశం ప్రస్తావన కూడా లేదు. విశేషం ఏమిటంటే.. స్వచ్ఛసర్వేక్షణ్‌లో తిరుపతి నగరపాలక సంస్థకు వచ్చినన్ని అవార్డులు, ర్యాంకులు న్యూడిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్డీఎంసీ)కి రాలేదు. అలాంటి ప్రాంతాన్ని స్టడీ టూర్‌గా నిర్ణయించుకోవడం పట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు సంగతేమిటంటే.. ఈనెల 27, 28 తేదీల్లో డిల్లీలో జరగనున్న తిరుపతి కమిషనర్‌ అనుపమ అంజలి పెళ్లి వేడుకలకు కార్పొరేటర్లందరూ వెళ్లాలనుకున్నారని తెలుస్తోంది. ఇంత ఖర్చూ జేబుల్లోంచి ఎందుకు పెట్టుకోవాలని స్టడీటూర్‌ ప్లాన్‌ వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరి బుధవారం ఉదయం 11 గంటలకు మేయర్‌ డాక్టర్‌ శిరీష అధ్యక్షతన ఎస్వీయూ సెనేట్‌ హాలులో జరగనున్న సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Updated Date - 2023-01-18T00:24:44+05:30 IST