కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెడదాం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-03-26T01:07:05+05:30 IST

జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టి.. ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు.

కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెడదాం: కలెక్టర్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న హరినారాయణన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 25: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టి.. ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో డిస్ట్రిక్ట్‌ ఇండస్ర్టియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు మౌలిక సదుపాయాల కల్పించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన లైసెన్సు విధానంపై వారికి అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలన్నారు. పీఎంఈజీపీ కింద జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా రూ.7.32 కోట్లతో 171 యూనిట్ల ఏర్పాటుకు లక్ష్యం నిర్దేశించగా.. ఇప్పటివరకు రూ.5.91కోట్లతో 161 యూనిట్లు స్థాపించనట్టు తెలిపారు. ఎంఎ్‌సఎంఈలలో 92 క్లెయిమ్‌లకు రూ.5.61లక్షల ప్రోత్సాహకాన్ని అందించడానికి సిఫారుసు చేశామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌, డీఐసీ జీఎం చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుహానా సోని, ఎల్డీఎం శేషగిరిరావు, డీపీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T01:07:05+05:30 IST