పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుమార్‌ రాజా

ABN , First Publish Date - 2023-06-17T00:42:49+05:30 IST

రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా బంగారుపాళ్యంకు చెందిన ఎం.బి.కుమార్‌రాజా నియమితులయ్యారు.

పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుమార్‌ రాజా
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కుమార్‌ రాజా

బంగారుపాళ్యం, జూన్‌ 16: రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌గా బంగారుపాళ్యంకు చెందిన ఎం.బి.కుమార్‌రాజా నియమితులయ్యారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలోని చైర్మన్‌ చాంబర్‌లో సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మాజీ జడ్పీ చైర్మన్‌గా, వైసీపీ రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకుడిగా, జాతీయ పంచాయతీరాజ్‌ సభ్యుడిగా కుమార్‌ రాజా ఉన్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈయనతో పాటు బంగారుపాళ్యం ఏఎంసీ చైర్మన్‌ నారే సోమశేఖర్‌, పాలఏకరి కార్పొరేషన్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-17T00:42:49+05:30 IST