Share News

చంపేసి...ఆపై ఉరేసి

ABN , Publish Date - Dec 24 , 2023 | 01:38 AM

ఓ మహిళను హత్య చేసి ఆపై ఉరేసిన దారుణ వుదంతమిది. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు....పుత్తూరు పట్టణం కళ్యాణపురంలోని ఒక ఇంట్లో మిద్దెపైన వాటాలో దంపతులు గోపి, శ్రీదేవి (49) అద్దెకు కాపురముంటున్నారు.

చంపేసి...ఆపై ఉరేసి
శ్రీదేవి (ఫైల్‌ ఫొటో)

పుత్తూరులో మహిళ దారుణ హత్య

పుత్తూరు అర్బన్‌, డిసెంబర్‌ 23:ఓ మహిళను హత్య చేసి ఆపై ఉరేసిన దారుణ వుదంతమిది. సీఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు....పుత్తూరు పట్టణం కళ్యాణపురంలోని ఒక ఇంట్లో మిద్దెపైన వాటాలో దంపతులు గోపి, శ్రీదేవి (49) అద్దెకు కాపురముంటున్నారు. వీరి కుమారుడు సాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె వివాహమై చెన్నైలో వుంటున్నారు.గోపి తిరుమలలో దుకాణం నడుపుతుండడంతో శ్రీదేవి ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రీదేవితో మాట్లాడేందుకు ఆమె కుమార్తె పలుమార్లు ఫోన్‌ చేసింది.తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమానిని అడిగింది.ఆయన మిద్దెపైకి వెళ్లి చూడగా ఇంట్లో నుంచి టీవీ శబ్దం వస్తోంది కానీ బయట తాళాలు వేసి ఉండడంతో అనుమానం వచ్చి పగులగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా శ్రీదేవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కుర్చీలో కూలబడిపోయి ఉంది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీదేవి మెడలో నగలు, బీరువాలో విలువైన వస్తువులు, నగదు చోరీకి గురైనట్లు సమీప బంధువులు చెప్పారు. శ్రీదేవి తలకు బలమైన గాయాలై ఉన్నాయి. హాల్లో రక్తపు మరకలు కూడా ఉన్నాయి.శ్రీదేవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు నమ్మించేందుకు నేరస్తుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. హత్యకు ప్రధాన కారణం దొంగతనమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Dec 24 , 2023 | 01:38 AM