కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి

ABN , First Publish Date - 2023-09-04T00:41:10+05:30 IST

కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలంటూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యుగంధర్‌ ఆధ్వర్యంలో గాండ్లమిట్ట కూడలి వద్ద ఆదివారం 12 గంటల పాటు నిరహారదీక్ష చేశారు.

కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి
హారదీక్ష చేస్తున్న జనసేన నాయకులు

కార్వేటినగరం, సెప్టెంబరు 3: కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలంటూ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యుగంధర్‌ ఆధ్వర్యంలో గాండ్లమిట్ట కూడలి వద్ద ఆదివారం 12 గంటల పాటు నిరహారదీక్ష చేశారు. తుడా పరిధిలో ఉన్న కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో ఎందుకు కలపడం లేదని ఆయన ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో ఎందుకు చేర్చలేకపోయారో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శోభన్‌ బాబు, విజయ్‌, రాఘవ, సురే్‌షరెడ్డి, నరేష్‌, దేవేంద్ర, వెంకటేష్‌, అన్నామలై తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-04T00:41:10+05:30 IST