Share News

వరసిద్ధుడి సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:16 AM

పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు సులీల్‌దత్తామిశ్రా, అలోక్‌కుమార్‌పాండి కాణిపాక వరసిద్ధుడిని కుటుంబ సమేతంగా కలసి దర్శించుకున్నారు.

వరసిద్ధుడి సేవలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు
న్యాయమూర్తులకు జ్ఞాపికను అందిస్తున్న ఏఈవో హరిమాధవరెడ్డి

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 25: పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు సులీల్‌దత్తామిశ్రా, అలోక్‌కుమార్‌పాండి కాణిపాక వరసిద్ధుడిని కుటుంబ సమేతంగా కలసి దర్శించుకున్నారు. ఏఈవో హరిమాధవరెడ్డి ఆలయ మర్యాదలతో వీరిని ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో వారి వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:17 AM