మాడవీధుల్లో జ్ఞానమూర్తి కటాక్షం
ABN , First Publish Date - 2023-09-20T02:02:03+05:30 IST
హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడిని తిలకించిన భక్తజనం ఉప్పొంగిపోయింది.
హంస వాహనంపై సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడిని తిలకించిన భక్తజనం ఉప్పొంగిపోయింది.తిరుమల మాడవీధుల్లో కర్పూర హారతులిచ్చి కటాక్షించమంటూ వేడుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఏడుతలల స్వర్ణశేషవాహనంపై వైకుంఠనాథుడి అలంకారంలో ఊరేగిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మంగళవారం ఉదయం ద్వారకా కృష్ణుడి అలంకారంలో ఐదు తలల చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చారు.సోమవారం సాయంత్రం ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్ర్తాలు సమర్పించారు.
తిరుమల,ఆంధ్రజ్యోతి