నేడు షార్‌కు ఇస్రో చైర్మన్‌ రాక

ABN , First Publish Date - 2023-07-08T23:55:12+05:30 IST

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 14న చంద్రయాన్‌-3 ప్రయోగం జరగనున్న నేపధ్యంలో ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది.

నేడు షార్‌కు ఇస్రో చైర్మన్‌ రాక
ఉపగ్రహానికి అమర్చిన ఉష్టకవచం

సూళ్లూరుపేట, జూలై 8: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 14న చంద్రయాన్‌-3 ప్రయోగం జరగనున్న నేపధ్యంలో ఇప్పటికే సందడి వాతావరణం నెలకొంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువు గల చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని పంపనున్నారు. ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌కు సంబంధించి శనివారం ఎలక్ర్టికల్‌ వ్యవస్థల పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రయోగానికి సంబంధించిన ఎంఆర్‌ఆర్‌ సమావేశం షార్‌లో ఈ నెల 11న జరగనుంది. అనంతరం మిషన్‌ రెడీనెష్‌ రివ్యూ సమావేశం నిర్వహించి కౌంట్‌డౌన్‌ తదితర సమయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. చంద్రయాన్‌-3 కీలక ప్రయోగం కావడంతో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆదివారం షార్‌కు విచ్చేస్తున్నారు.ప్రయోగ ఏర్పాట్లలో పాలుపంచుకోనున్నారు. అన్ని సజావుగా సాగితే ఈ నెల 14న మధ్యాహ్నం 2:35 గంటలకు షార్‌లో రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-3 రాకెట్‌ నింగిలోకి ఎగరనుంది.

Updated Date - 2023-07-08T23:55:12+05:30 IST