Share News

స్విప్‌ యాక్టివిటీ్‌సని ముమ్మరం చేయండి

ABN , First Publish Date - 2023-11-02T01:46:17+05:30 IST

జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు స్విప్‌ యాక్టివిటీ్‌సని ముమ్మరం చేయాలని కలెక్టర్‌ షన్మోహన్‌ అధికారులను ఆదేశించారు.

స్విప్‌ యాక్టివిటీ్‌సని ముమ్మరం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ షన్మోహన్‌

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 1: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేసేందుకు స్విప్‌ యాక్టివిటీ్‌సని ముమ్మరం చేయాలని కలెక్టర్‌ షన్మోహన్‌ అధికారులను ఆదేశించారు. చిత్తూరులోని జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణకు సంబంధించి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, ప్రత్యేక అధికారులు, మండల స్థాయి బృందాలకు బుధవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాలోని జెండర్‌, ఈపీ రేషియోపై తహసీల్దార్లు దృష్టి సారించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా ఇంటర్‌, డిగ్రీ, బీబీఏ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, ఇంజనీరింగ్‌, బి.ఈడీ తదితర కాలేజీల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నమోదు చేయాలన్నారు. ఈనెల 4, 5 తేదీలు, డిసెంబరు 2, 3 తేదీలలో ఓటర్ల జాబితా సవరణ శిబిరాలు నిర్వహించాలన్నారు. డిసెంబరు 26 నాటికి వచ్చిన క్లెయిమ్‌లు, ఆక్షేపణలపై విచారణ పూర్తి చేసి 2024 జనవరి 1న డేటాబేస్‌ వివరాలు అప్‌లోడ్‌ చేయాలన్నారు. జనవరి 5న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో రాజశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌, చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం, ఆర్డీవోలు, ట్రైనీ కలెక్టర్‌ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-02T01:46:17+05:30 IST