ఈనెల నుంచే పెన్షనర్ల ఆదాయపు పన్ను సమాన వాయిదాల్లో రికవరీ

ABN , First Publish Date - 2023-07-21T23:42:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తాజా సూచనల మేరకు ఆదాయపు పన్ను పరిధిలో గల పెన్షనర్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు ఈనెల నుంచే సమాన వాయిదాల్లో రికవరీ చేస్తామని జిల్లా ఖజానాశాఖ డిప్యూటీ డైరక్టర్‌ రామచంద్ర శుక్రవారం తెలిపారు.

ఈనెల నుంచే పెన్షనర్ల ఆదాయపు పన్ను  సమాన వాయిదాల్లో రికవరీ

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం తాజా సూచనల మేరకు ఆదాయపు పన్ను పరిధిలో గల పెన్షనర్లు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు ఈనెల నుంచే సమాన వాయిదాల్లో రికవరీ చేస్తామని జిల్లా ఖజానాశాఖ డిప్యూటీ డైరక్టర్‌ రామచంద్ర శుక్రవారం తెలిపారు. 2023 జూలై నెల పేయబుల్‌ ఇన్‌ ఆగస్టు పెన్షన్‌ నుంచి ఫిబ్రవరి వరకు వసూలు చేస్తామన్నారు. పెన్షనర్లకు సంబంధించి రాష్ట్రస్థాయిలో సీఎ్‌ఫఎంఎ్‌సలో ఆదాయపు పన్ను గణన చేసి తగ్గిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 12,360 మంది ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నారని వివరించారు. ఆదాయపు పన్నుశాఖ సూచనల మేర పెన్షనర్లు అందరూ కొత్త పన్ను పరిధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఒకవేళ పెన్షనర్‌ పాత విధానంలోనే కొనసాగదలచుకుంటే సంబంధిత ఎస్టీవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ మేర దరఖాస్తు ఇచ్చిన వారినే పాత విధానంలో కొనసాగిస్తారని స్పష్టం చేశారు. పాతవిధానంలో కొనసాగదలచిన ప్రభుత్వ పెన్షనర్లు తమ పొదుపు వివరాలను సీఎ్‌ఫఎంఎస్‌ సైట్‌లో ఈఎ్‌సఎ్‌సలో అప్‌లోడ్‌ చేయాలన్నారు. లేదా సంబంధిత వివరాలను స్థానిక సబ్‌ట్రెజరీ అధికారికి అందజేయాలని సూచించారు.

Updated Date - 2023-07-21T23:42:43+05:30 IST