జిల్లా అంతటా భారీ వర్షం

ABN , First Publish Date - 2023-09-04T00:37:02+05:30 IST

ఉపరితల ఆవర్తనాల కారణంగా మూడు రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

జిల్లా అంతటా భారీ వర్షం

గుడిపాలలో రికార్డుస్థాయిలో 147 మి.మీ వర్షపాతం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 3: ఉపరితల ఆవర్తనాల కారణంగా మూడు రోజులుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు కుప్పం, గుడుపల్లె మండలాలు మినహా 29 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కనీవిని ఎరుగని రీతిలో గుడిపాలలో 147 మి.మీ వర్షం కురిసింది. మండలాలవారీగా.. పులిచెర్లలో 95.2, పుంగనూరులో 89.2, విజయపురంలో 73.2, చిత్తూరులో 65.6, వెదురుకుప్పంలో 50.4, నగరిలో 50.2, రామకుప్పంలో 46.2, పెనుమూరులో 44.2, నిండ్రలో 43.2, బైరెడ్డిపల్లిలో 41.0, రొంపిచెర్లలో 36.6, ఐరాలో 36.0, కార్వేటినగరంలో 33.8, చౌడేపల్లిలో 32.6, పెద్దపంజాణిలో 30.4, యాదమరిలో 30.0, సదుంలో 28.6, సోమలలో 27.6, వి.కోటలో 25.6, పలమనేరులో 17.6, గంగాధరనెల్లూరులో 17.0, పాలసముద్రంలో 16.4, పూతలపట్టులో 15.6, తవణంపల్లెలో 14.4, గంగవరంలో 14.2, శ్రీరంగరాజపురంలో 10.2, బంగారుపాళ్యంలో 9.6, శాంతిపురంలో 5.0 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - 2023-09-04T00:37:02+05:30 IST