దంచేసిన వాన
ABN , First Publish Date - 2023-09-18T01:41:57+05:30 IST
గుడుపల్లె మినహా 30 మండలాల్లో వాన దంచేసింది. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు..

గుడుపల్లె మినహా 30 మండలాల్లో వర్షం
చిత్తూరు కలెక్టరేట్/వి.కోట, సెప్టెంబరు 17: గుడుపల్లె మినహా 30 మండలాల్లో వాన దంచేసింది. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు.. పుంగనూరు మండలంలో 70.2, నిండ్రలో 66.6, పులిచెర్లలో 59.8, పెనుమూరులో 53.6, పెద్దపంజాణిలో 53.2, గుడిపాలలో 48, యాదమరిలో 44.4, పూతలపట్టులో 43.2, బంగారుపాళ్యంలో 40, చౌడేపల్లెలో 39.6, సోమలలో 38.2, రొంపిచెర్లలో 38, గంగవరంలో 36.4, గంగాధరనెల్లూరు.. వి.కోటలో 35.4, పలమనేరులో 33.2, వెదురుకుప్పం.. తవణంపల్లెలో 30.2, శ్రీరంగరాజపురంలో 29.2, కార్వేటినగరంలో 20.4, చిత్తూరు.. పాలసముద్రంలో 20.2, ఐరాలలో 20, సదుంలో 18, నగరిలో 17.2, బైరెడ్డిపల్లెలో 13.4, విజయపురంలో 5.8, శాంతిపురం.. కుప్పంలో 3, రామకుప్పంలో 2.8 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. వి.కోటలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది.