Share News

కాణిపాకంలో హనుమాన్‌ చాలీసా

ABN , Publish Date - Dec 26 , 2023 | 12:15 AM

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆస్థాన మండపంలో సోమవారం హనుమాన్‌ చాలీసా నిర్వహించారు.

కాణిపాకంలో హనుమాన్‌ చాలీసా
ఆస్థాన మండపంలో హనుమాన్‌ చాలీసా నిర్వహిస్తున్న ఉదయ్‌కుమార్‌ భాగవతార్‌

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 25: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆస్థాన మండపంలో సోమవారం హనుమాన్‌ చాలీసా నిర్వహించారు. చెన్నైకి చెందిన శ్రీరామాజనేయ నామ సంకీర్తన మండలి మండలి ఉదయ్‌కుమార్‌శర్మ భాగవతార్‌ వారి బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించారు. హనుమాన్‌ చాలీసాను వినడానికి వందలాదిగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, రామాయణహరినాథ్‌రెడ్డి, నిర్వాహకులు భాస్కర్‌ నాయుడు, జగదీశ్వర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 12:15 AM