యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా జీవీ రమణ
ABN , First Publish Date - 2023-12-11T00:43:55+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా చిత్తూరుకు చెందిన జీవీ రమణ ఎంపికయ్యారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 10: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా చిత్తూరుకు చెందిన జీవీ రమణ ఎంపికయ్యారు. శని, ఆదివారాలలో ఏలూరు చలసాని గార్డెన్‌లో యూటీఎఫ్ నిర్వహించిన 49వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి జీవీ రమణకు చోటు లభించగా, ఈయన గత ఆరు సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంఘానికి సేవలు అందించారు. ఈయనతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రఘుపతిరెడ్డి, సోమశేఖర్‌నాయుడు, మణిగండన్, దీనావతిలకు అవకాశం లభించింది.