గూడూరు 44.4 డిగ్రీలు

ABN , First Publish Date - 2023-05-26T02:20:14+05:30 IST

జిల్లావ్యాప్తంగా పాతిక మండలాల్లో గురువారం సూరీడు సెగలు రేపాడు. గూడూరులో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా 10 మండలాల్లో 42 డిగ్రీలకు మించి నమోదైంది.

గూడూరు 44.4 డిగ్రీలు

పాతిక మండలాల్లో సుర్రుమన్న సూరీడు

11 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా వేడిమి

తిరుపతి, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా పాతిక మండలాల్లో గురువారం సూరీడు సెగలు రేపాడు. గూడూరులో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా 10 మండలాల్లో 42 డిగ్రీలకు మించి నమోదైంది. సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల్లో 43.4 డిగ్రీలు, బాలాయపల్లిలో 43.3, తడలో 43.1, వడమాలపేటలో 42.7, శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో 42.6 డిగ్రీలు, వెంకటగిరి, తొట్టంబేడు మండలాల్లో 42.4 డిగ్రీలు, సూళ్ళూరుపేటలో 42.1, చిల్లకూరు, రేణిగుంట, కేవీబీపురం మండలాల్లో 41.7 డిగ్రీలు, కోటలో 41.6, పిచ్చాటూరు, తిరుపతి అర్బన్‌ మండలాల్లో 41.5 డిగ్రీలు, చిట్టమూరు, డక్కిలి, దొరవారిసత్రం మండలాల్లో 41 డిగ్రీలు, ఓజిలిలో 40.8, చంద్రగిరి, నాగలాపురం మండలాల్లో 40.6 డిగ్రీలు, బీఎన్‌ కండ్రిగ, పెళ్ళకూరు మండలాల్లో 40.3 డిగ్రీలు చొప్పున ఉష్ణోగత్రలు రికార్డయ్యాయి.

నేడు, రేపు మరిన్ని మండలాల్లో ఇదే పరిస్థితి

గూడూరు, వరదయ్యపాలెం, సత్యవేడు, బాలాయపల్లి, తొట్టంబేడు, సూళ్ళూరుపేట, కోట, డక్కిలి, దొరవారిసత్రం, ఓజిలి, బీఎన్‌ కండ్రిగ, పెళ్ళకూరు తదితర మండలాల్లో శుక్రవారం 40 డిగ్రీలు దాటి ఎండ వేడిమి నెలకొంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పుత్తూరు, నారాయణవనం, పెళ్ళకూరు, నారాయణవనం, బీఎన్‌ కండ్రిగ, ఓజిలి, దొరవారిసత్రం, డక్కిలి, చిట్టమూరు, పిచ్చాటూరు, కోట, కేవీబీపురం, రేణిగుంట, చిల్లకూరు, తొట్టంబేడు, ఏర్పేడు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, వడమాలపేట, బాలాయపల్లి, సత్యవేడు, వరదయ్యపాలెం, గూడూరు తదితర 23 మండలాల్లో శనివారం 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నెలకొంటాయని ఆ శాఖ అంచనా వేసింది.

Updated Date - 2023-05-26T02:20:14+05:30 IST