గుడుపల్లె ఎంపీడీవో సస్పెన్షన్
ABN , First Publish Date - 2023-06-26T23:53:18+05:30 IST
గుడుపల్లె ఎంపీడీవో రమణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ షన్మోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా అక్కడి వైసీపీ నాయకులు, ప్రజల నుంచి ఎంపీడీవోపై ఫిర్యాదులు అందినట్లు, ఆ కారణంగానే ఎంపీడీవోను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
చిత్తూరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): గుడుపల్లె ఎంపీడీవో రమణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ షన్మోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటన సందర్భంగా అక్కడి వైసీపీ నాయకులు, ప్రజల నుంచి ఎంపీడీవోపై ఫిర్యాదులు అందినట్లు, ఆ కారణంగానే ఎంపీడీవోను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వెనుకంజలో ఉన్నారని, ప్రజలు.. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం లేదనే కారణాలు సస్పెండ్ ఆర్డర్స్‌లో ప్రస్తావించారు. రెగ్యులర్ ఏవోగా ఉన్న ఈయన, నెల రోజులు ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. అంతకుముందు బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లోనూ ఈయన పనిచేశారు. ప్రాథమిక విచారణ తర్వాత సస్పెండ్ చేసి, ఇప్పుడు డీటైల్డ్ విచారణ కోసం పలమనేరు డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ ఉమావాణిని నియమించారు. ప్రస్తుతం అక్కడి ఈవోపీఆర్డీ శంకర్‌కు ఇన్‌ఛార్జి ఎంపీడీవో బాధ్యతలను అప్పగించారు.