ఈ శిక్ష ఏసిండాడంటే దేవుడు మంచి చేస్తిందా!
ABN , First Publish Date - 2023-09-26T01:53:44+05:30 IST
ఎన్నో మంచి పనులు చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ పంచిన చంద్రబాబుకు జైలు శిక్ష వేయించిన వారికి దేవుడు మంచి చేయడని ఓ తల్లి శాపనార్థాలు పెట్టింది

కుప్పం, సెప్టెంబరు 25: ఎన్నో మంచి పనులు చేసి అభివృద్ధి ఫలాలు అందరికీ పంచిన చంద్రబాబుకు జైలు శిక్ష వేయించిన వారికి దేవుడు మంచి చేయడని ఓ తల్లి శాపనార్థాలు పెట్టింది. స్కిల్ డెవల్‌పమెంట్ పథకం చేసిన మేలును వివరించే కరపత్రాలను టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ నేతృత్వంలో సోమవారం ఉదయం ఏడు గంటలకు కుప్పం రైల్వే స్టేషన్‌లో పంచిపెట్టారు. పుష్‌పుల్ రైలులో ప్రయాణికులకు పంచారు. అదే రైలులో ప్రయాణిస్తున్న కుప్పానికి చెందిన ఓ మహిళ నాయకులముందు గోడుమంది. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును అరెస్టు చేయడంపై కళ్లనీళ్లు పెట్టుకుంది. అందుకు కారకులైన వారికి శాపనార్థాలు పెట్టింది. కరపత్రంలోని చంద్రబాబును చూస్తూ ‘ఊరూరికీ రోడ్లేసినాడు. ఊరూరికీ అన్నీ చేసినోడు. ఇప్పుడీ శిక్షీ ఏసిండాడంటే, దేవుడు మంచి చేస్తిందా’ అని ఆ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు.