వైభవంగా సంకటహర గణపతి వ్రతం
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:35 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో సంకటహర గణపతి వ్రతాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఈ వ్రతాన్ని భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం, సాయంత్రం జరిగిన ఈ వ్రతంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ వ్రతాన్ని పౌర్ణమి గడచిన నాలుగవ రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి పూజలు చేసి, సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. అలాగే రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాక పుర వీధులలో ఘనంగా ఊరేగించారు. స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు కాణిపాకం విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశు, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.