గుండెపోటుతో మహిళా ఖైదీ మృతి

ABN , First Publish Date - 2023-08-02T01:24:11+05:30 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళా రిమాండ్‌ ఖైదీ గుండెపోటుతో మృతి చెందారు. దీనిపై మంగళవారం వెస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

గుండెపోటుతో మహిళా ఖైదీ మృతి

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 1: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళా రిమాండ్‌ ఖైదీ గుండెపోటుతో మృతి చెందారు. దీనిపై మంగళవారం వెస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వెస్ట్‌ సీఐ జయనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామకుప్పం మండలానికి చెందిన ఎం.ప్రమీల (47) ఆ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ హత్య కేసు (నెంబరు 115/23)లో నిందితురాలిగా మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. కొంతకాలంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో జైలు అధికారులు ఈనెల 26న తిరుపతిలోని రుయాస్పత్రిలో చేర్చారు. ఏడ్రోజులుగా చికిత్స పొందున్న ఆమె సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. దీనిపై వెస్ట్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదుచేశారు. బుధవారం ఆర్డీవో సమక్షంలో పంచనామా నిర్వహించాక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2023-08-02T01:24:11+05:30 IST