వేగంగా సోలార్ ఫెన్సింగ్ పనులు
ABN , First Publish Date - 2023-02-21T02:03:21+05:30 IST
కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు సమీప గ్రామాలు, పొలాల్లోకి రాకుండా ఉండేందుకు సోలార్ ఫెన్సింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు డీఎ్‌ఫవో చైతన్యకుమార్‌రెడ్డి సోమవారం తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), ఫిబ్రవరి 20: కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు సమీప గ్రామాలు, పొలాల్లోకి రాకుండా ఉండేందుకు సోలార్ ఫెన్సింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు డీఎ్‌ఫవో చైతన్యకుమార్‌రెడ్డి సోమవారం తెలిపారు. పలమనేరు, కుప్పం, ప్రాంతాల్లో రూ.32 లక్షలతో 6 కిలోమీటర్లు ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కుప్పంలోని నడిమూరు బీట్, పలమనేరులో పింగారికుంట ప్రాంతాల్లో ఏనుగులు తాకిడి ఎక్కువగా ఉందన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి ఏనుగులు జిల్లాలోకి వస్తున్నాయన్నారు. వీటి నివారణకు 14 అడుగుల ఎత్తులో తోరణాలుగా ఫెన్సింగ్ వేలాడదీస్తున్నామన్నారు. వీటికి ఏనుగులు తగిలితే కొద్ది పాటి షాక్ కొట్టి.. లోపలకు రాకుండా ఉంటాయన్నారు.