Share News

పొలం దున్నుతూ రైతు దుర్మరణం

ABN , Publish Date - Dec 26 , 2023 | 02:09 AM

ఓ రైతు పొలం దున్నుతూ ట్రాక్టరు బోల్తా పడడంతో మృతి చెందాడు

పొలం దున్నుతూ రైతు దుర్మరణం
కృష్ణయ్య

బోల్తా పడ్డ ట్రాక్టరు కింద పడి మృత్యువాత

బోల్తా పడిన ట్రాక్టరు కింద కృష్ణయ్య మృతదేహం

ఏర్పేడు, డిసెంబరు 25: ఓ రైతు పొలం దున్నుతూ ట్రాక్టరు బోల్తా పడడంతో మృతి చెందాడు.సీఐ శ్రీహరి కథనం మేరకు ....ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామానికి చెందిన కొమ్మిశెట్టి క్షష్ణయ్య(58) తన పొలాన్ని దున్నుకోవడానికి ట్రాక్టరును ఆదివారం సాయంత్రం తీసుకెళ్లాడు.అడుసుపొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తా పడింది. ట్రాక్టర్‌ కింద పడ్డ కృష్ణయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమీపంలో వెళుతున్న గిరిజనులు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు.గ్రామస్తులతో కలిసి వచ్చిన కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఎక్సకవేటర్‌ సాయంతో ట్రాక్టర్‌ను పక్కకు తీశారు.కృష్ణయ్య మృత దేహాన్ని పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం మృతదేహాన్ని కృష్ణయ్య కుటుంబసభ్యులకు అప్పగించారు.

Updated Date - Dec 26 , 2023 | 02:10 AM