రేషన్ పంపిణీ గడువు పొడిగింపు
ABN , Publish Date - Dec 17 , 2023 | 11:14 PM
నిత్యావసర వస్తువుల పంపిణీ గడువును ప్రభుత్వం సోమవారం వరకు పొడిగించినట్లు డీఎస్వో శంకరన్ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 17: నిత్యావసర వస్తువుల పంపిణీ గడువును ప్రభుత్వం సోమవారం వరకు పొడిగించినట్లు డీఎస్వో శంకరన్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు నెల కోటాకు సంబంధించి రేషన్ పంపిణీ గడువు ఆదివారంతో ముగియగా, కొందరు కార్డుదారుల వినతిమేరకు సోమవారం వరకు గడువును పొడిగించిందన్నారు. సరుకులు ఇంకా పొందని కార్డుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.