ముగిసిన మహా సంప్రోక్షణ

ABN , First Publish Date - 2023-05-26T02:23:55+05:30 IST

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి.

ముగిసిన మహా సంప్రోక్షణ

తిరుపతి(కల్చరల్‌), మే 25 : తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న మహాసంప్రోక్షణ కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. ఆలయ విమాన గోపురానికి బంగారుపూత పూసిన రాగి రేకులు అమర్చాక జీర్ణోద్ధరణతో పాటు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.గురువారం ఉదయం 7.45 నుండి 9.15 గంటల వరకూ మిధునలగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు.11.30 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు.సాయంకాలం పెద్దశేషవాహనంలో గోవిందరాజ స్వామి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకురార్పణ జరిగింది. శుక్రవారం నుంచి జూన్‌ 3 వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు శుక్రవారం ఉదయం 8.22నుంచి 8.49గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారు.రాత్రి పెద్దశేషుడిపై స్వామివారు విహరించడంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి.

Updated Date - 2023-05-26T02:23:55+05:30 IST